ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 'కోటి' దాటిన కరోనా పరీక్షలు

author img

By

Published : Jul 6, 2020, 1:12 PM IST

సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ ప్రకటించింది. గత 14 రోజుల్లో సగటుకు రోజున 2 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించింది.

COVID-19 tests in India cross one-crore mark
దేశవ్యాప్తంగా కోటి దాటిన కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు సోమవారం ఉదయం నాటికి కోటి మార్కును దాటాయి. ఈ విషయాన్ని భార‌త వైద్య‌ ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్)​ వెల్లడించింది.

"సోమవారం ఉదయం 11 గంటల వరకు 1,00,04,101 నమూనాల పరీక్షలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే 1,80,595 పరీక్షలు నిర్వహించారు."

--- లోకేశ్​ శర్మ, ఐసీఎంఆర్​ సైంటిస్ట్​-మీడియా కోఆర్డినేటర్​.

దేశవ్యాప్తంగా 1,105 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు శర్మ. వీటిలో 788 ప్రభుత్వానికి చెందినవని.. 317 ప్రైవేటు ల్యాబ్​లని వివరించారు. రోజువారీ పరీక్షల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందన్నారు. గడిచిన 14 రోజుల్లో సగటున రోజుకు 2 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించారు.

ల్యాబ్​లు కూడా...

తొలుత.. పుణెకు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీలోనే వైరస్​ పరీక్షలు నిర్వహించేవారు. అనంతరం లాక్​డౌన్​ ప్రారంభమైనప్పుడు 100 ల్యాబ్​లను ఏర్పాటు చేశారు. జూన్​ 23న.. ఆ సంఖ్య 1000కి చేరింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ పంజా విసురుతోంది. కొత్తగా 24,248కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. మరో 425మంది మరణించారు. మృతుల సంఖ్య 19,693కు పెరిగింది.

ఇదీ చూడండి:- సరైన మార్గనిర్దేశంతో భారతీయ టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.