దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90,632 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 41లక్షల 13వేల 811కు చేరింది. కొవిడ్ సోకడం వల్ల మరో 1,065 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణించిన వారి సంఖ్య 70వేల 626 కు పెరిగింది.
![CORONA VIRUS DETAILS IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8697399_coronavirusinindia.jpg)
దేశవ్యాప్తంగా శనివారం 10,92,654 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం టెస్ట్‌ల సంఖ్య 4 కోట్ల 88 లక్షలు దాటింది.
![CORONAVIRUS UPDATES IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8697399_coronastatewidecases.jpg)
మెరుగవుతోన్న రికవరీ రేటు..
పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 77.32 శాతంగా ఉంది. మరణాలు రేటు మరింత ఊరట కలిగిస్తూ 1.72 శాతానికి పడిపోయింది.
![CORONAVIRUS UPDATES IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8697399_covidindia.jpg)
ఇదీ చదవండి: కరోనా హాట్స్పాట్లుగా మారిన పల్లెలు