దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మరో 86,508 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 57లక్షల 32వేల 518కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,129 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 91వేల 149కి చేరింది.
దేశవ్యాప్తంగా బుధవారం 11,56,569 నమూనాలు పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లిండించింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 6కోట్ల 74లక్షలు దాటింది.
పెరిగిన రికవరీలు
దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా రికవరీల సంఖ్య వరుసగా ఐదోరోజూ కొత్త కేసులను దాటిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: 'ఆర్టీ-పీసీఆర్' టెస్టు.. ఐదు రోజుల్లో 3 భిన్న ఫలితాలు