కరోనా విషయంలో కేంద్రం సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కొవిడ్-19 కేసులపై గతంలో నీతి ఆయోగ్ వేసిన అంచనాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"నీతి ఆయోగ్‌లోని మేధావులు ఎంత గొప్పవారో చూడండి. దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో మే16 నుంచి కొత్త కొవిడ్-19 కేసులు ఉండవని అప్పట్లో వారు ఇచ్చిన గ్రాఫ్‌ను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను."
-రాహుల్ గాంధీ
దేశంలో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైరస్ బారిన పడగా.. 2500 మందికి పైగా మరణించారు.
ఇదీ చూడండి: రూ.1.63 లక్షల కోట్లతో కర్షక భారతానికి కొత్త రూపు