ETV Bharat / bharat

'వైరస్ పరీక్షలు పెరిగితేనే లాక్​డౌన్​తో ప్రయోజనం' - Covid-19 pandemic in india

దేశంలో కరోనా వైరస్ పరీక్షలు పెరగాలని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. లాక్​డౌన్ ప్రయోజనం చేకూరాలంటే పరీక్షల రేటు పెరగాల్సిందేనని ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు. ఇది వైరస్​పై పోరులో శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి సహకరించాల్సిన సమయమని తెలిపారు.

priyanka gandhi
ప్రియాంక గాంధీ
author img

By

Published : Apr 4, 2020, 3:21 PM IST

కరోనా వైరస్​ పరీక్షలను దేశంలో వేగవంతం చేయాలన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. లాక్​డౌన్​ ప్రయోజనం చేకూరాలంటే పరీక్షల రేటు పెరగాల్సిందేనని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. పరీక్షల ఫలితాల ద్వారా వైరస్ తీవ్రత, వ్యాధి ప్రభావిత ప్రాంతాలు, కరోనాపై కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

tweet
ప్రియాంక గాంధీ ట్వీట్

"కరోనా వైరస్ పరీక్షల రేటును భారత్ తక్షణమే పెంచాల్సిన అవసరం ఉంది. వైరస్​ గురించి కీలకమైన సమాచారం కోసం పరీక్షల ఫలితాలు వేగవంతం చేయాలి. లాక్​డౌన్ ప్రయోజనాలు చేకూరాలంటే పెద్దఎత్తున వైరస్ నిర్ధరణ పరీక్షలు, వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి

వైద్య సిబ్బంది సమస్యలపై..

వైరస్​పై పోరులో వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు ప్రియాంకగాంధీ. నర్సులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, వారి జీతాల్లో కోత విధించకూడదని తెలిపారు. ఇది వారికి సహకరించాల్సిన సమయం అన్నారు .

ఇదీ చూడండి: బయటకు వెళ్తే మాస్క్​ తప్పనిసరి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.