ETV Bharat / bharat

కరోనా​ ఐసోలేషన్​ వార్డులో నర్సులకు 'పరీక్ష'

కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. కొంతమంది వైరస్​ బారిన పడుతున్నారు. అయితే పంజాబ్​లో మహమ్మారి లక్షణాలతో బాధపడుతూ ఐసోలేషన్​కే పరిమితమైన ఇద్దరు నర్సులు అక్కడే పరీక్షలు రాశారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ వారిని మెచ్చుకున్నారు.

Covid-19 positive nurses attends for an exam in Punjab, Cm Amarinder Singh praised
కరోనా​ ఐసోలేషన్​ వార్డులోనే పరీక్ష రాసిన నర్సులు..
author img

By

Published : Jun 23, 2020, 3:08 PM IST

పంజాబ్​ పటియాలాలో ఇద్దరు నర్సులు కరోనాపై పోరాడుతూనే.. కెరీర్​ గురించి ఆలోచించారు. మహమ్మారి సోకి ఐసోలేషన్​కే పరిమితమైన వాళ్లు.. అక్కడే పై చదువుల కోసం జరిగిన ఓ​ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. క్వారంటైన్​ కేంద్రంలోనే వారిద్దరికీ ప్రత్యేకంగా ఎగ్జామ్​ నిర్వహించారు అధికారులు.

నర్సులు ఇద్దరూ పరీక్ష​ రాస్తున్న ఫొటో బయటకు రాగా.. నెట్టింట వైరల్​ అయింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ స్పందించారు. నర్సుల నిబద్ధతపై ప్రశంసలు కురిపించారు.

  • Salute the spirit of these 2 young nurses from Rajindra Hospital, Patiala who tested positive for #Covid19. This, however, did not dishearten them and the Government agreed to their request to appear for their exam from the isolation facility itself. #MissionFateh pic.twitter.com/iyb5FBYBEL

    — Capt.Amarinder Singh (@capt_amarinder) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటివరకు పంజాబ్​లో 4,235 కేసులు నమోదవగా.. 2,825 మంది కోలుకున్నారు. 101 మంది మరణించారు. 21,300 మంది హోమ్​ క్వారంటైన్​లో ఉన్నారు.

ఇదీ చూడండి: బోధనలో కొత్త ఒరవడి.. ఇక అంతా ఆన్​లైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.