ETV Bharat / bharat

కరోనా ఉందని తెలిసినా.. ఫాస్ట్​ఫుడ్​ స్టాల్​ తెరిచాడు

author img

By

Published : Jun 28, 2020, 12:06 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతున్నా కొందరిలో నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది. అప్రమత్తంగా ఉండాల్సింది పోయి మరింత అశ్రద్ధ వహిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. ఏ మాత్రం లెక్కచేయడం లేదు. బంగాల్​లో ఓ వ్యక్తి తనకు వైరస్​ సోకిందని తెలిసినా ఫాస్ట్​ఫుడ్ స్టాల్​ను తెరవడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.

COVID 19 positive fast food stall owner opened shop in Malda, West Bengal
వైరస్​ ఉందని తెలిసినా.. ఫాస్ట్​ఫుడ్​ స్టాల్​ తెరిచాడు

కరోనా వైరస్​ పట్ల కొందరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో బంగాల్​లో​ తాజాగా జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ​బంగాల్​లోని మల్దాలో ఇటీవల ఓ ఫాస్ట్​ఫుడ్​ స్టాల్​ యజమానికి కొవిడ్​-19 సోకింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ చికిత్స తీసుకోవాల్సిన అతడు.. ఏమీ పట్టనట్టుగా.. 14 రోజుల క్వారంటైన్​ గడువైనా పూర్తికాకముందే శనివారం తన స్టాల్​ తెరిచాడు. అతడు తయారుచేసిన ఫాస్ట్​ఫుడ్​ను అక్కడి ప్రజలు కూడా కొన్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది అక్కడికి వచ్చి ఫాస్ట్​ఫుడ్ సెంటర్​ను మూసివేయించారు.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.