కరోనాపై పోరులో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనా ప్రతిస్పందన విభాగాల అధికారులతో సన్నద్ధతపై చర్చించారు. ఆసుపత్రులు, ఐసోలేషన్, నిర్బంధ కేంద్రాలు సరైన రీతిలో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య పరికరాల ఉత్పత్తి, సేకరణ చేపట్టి అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ప్రధాని. మాస్కులు, వెంటిలేటర్లు సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చూడండి: 'వైరస్ పరీక్షలు పెరిగితేనే లాక్డౌన్తో ప్రయోజనం'