కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించడం వల్ల సమాజంలో వారిని అంటరాని వారిగా చూస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. క్షేత్ర స్థాయిలో దాని పరిణామాలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
సుప్రీంకోర్టు ప్రశ్నలకు.. కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని సొంతంగా.. ఇతరులకు కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్లు అందించాలని ఆదేశాలు కేంద్రం జారీచేయలేదని స్పష్టం చేశారు. ఇతరులను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని.. ఎవరినీ కించపరిచే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
విచారణ మధ్యలో చొక్కాలేని వ్యక్తి..
కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న విచారణలో మంగళవారం ఓ వ్యక్తి చొక్కా లేకుండా కనిపించాడు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. 7 నెలల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుగుతున్నప్పటికీ పదే పదే ఇలాంటివి జరగటం సరైంది కాదని పేర్కొంది.
ఇదీ చూడండి:కొవిషీల్డ్ పనితీరుపై సీరం స్పష్టత