కరోనా బారినపడి ఆసుపత్రిలో గత నెల 25 నుంచి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కు 9వ రోజు నిర్వహించిన పరీక్షల్లో మరోసారి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా ఆయన అక్కడే చికిత్సను కొనసాగించనున్నట్లు వైద్యులు తెలిపారు.
భోపాల్‌లోని చిరయూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చౌహాన్‌కు ఇటీవల 'సార్స్-కొవ్-2' కోసం నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే.. టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చినా, తన ఆరోగ్యం బాగుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు సీఎం. తనలో వైరస్ లక్షణాలేవీ లేవని.. అయితే నెగెటివ్ ఫలితాలు వచ్చేవరకు ఆసుపత్రిలోనే ఉంటానని చెప్పారు.
ఐసోలేషన్‌లోనే రాఖీ వేడుకలు..
రక్షాబంధన్‌ను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు సరోజ్ అనే ఓ నర్సు.
ఇదీ చదవండి: ఐసోలేషన్‌లో ఐటీ మంత్రి.. కారణమిదే...