ETV Bharat / bharat

కరోనా పంజా: 'మహా'లో 15వేలకు చేరువలో మృతులు - COVID-19: Maha adds 10,320 new cases; 265 die, 7,543 recover

మహారాష్ట్రలో కొవిడ్​ ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 10 వేలకుపైగా పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 265 మంది వైరస్​కు బలవ్వగా.. మరణాల సంఖ్య 15వేలకు చేరువైంది. కర్ణాటకలోనూ వరుసగా ఎనిమిదో రోజూ రికార్డు స్థాయిలో 5 వేలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి.

COVID-19: Maha adds 10,320 new cases; 265 die, 7,543 recover
మహారాష్ట్రలో  15వేలకు చేరువైన మృతులు
author img

By

Published : Jul 31, 2020, 8:59 PM IST

దేశంలో కొవిడ్​ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా 10,230 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 4,22,118కు చేరింది. మరో 265 మంది మృతితో.. మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 15 వేలకు చేరువైంది.

ఇవాళ 7,543 మంది బాధితులు వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,56,158 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

కన్నడ నాట కరోనా విస్తరిస్తోందిలా..

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ కరోనా విలయం కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజూ 5 వేలకు పైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 5,483 కొత్త కేసులు వెలుగుచూడగా.. మొత్తం 1,24,115 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 84 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 2,314కు చేరింది.

వైరస్​ నుంచి కోలుకొని శుక్రవారం నాడు 3,130 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 49,788 మందికి వైరస్​ నయమైనట్లయింది. సుమారు 72 వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ విలయం: 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.