ETV Bharat / bharat

పెళ్లి కోసం 100 కి.మీ సైకిల్​పై ప్రయాణించిన వరుడు - pedalling

లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడ్డాయి. కానీ.. ఉత్తర్ ప్రదేశ్ లోని పౌథియా గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి వాయిదా వేయకూడదని నిశ్చయించుకుని.. 100 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి వధువు మెడలో తాలి కట్టాడు. ఆ తర్వాత అదే సైకిల్​పై భార్యను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.

tie nuptial knot
పెళ్లి కోసం 100 కి.మి సైకిల్ పై ప్రయాణించిన వరుడు
author img

By

Published : Apr 30, 2020, 8:21 PM IST

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎందరో వివాహాలు వాయిదా పడ్డాయి. కానీ.. ఉత్తర్​ప్రదేశ్ హమీర్​పుర్​ జిల్లా పౌథియా గ్రామానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం సుమారు 100 కిలోమీటర్ల దూరం సైకిల్​పై వెళ్లి ఆలయంలో వధువు మెడలో తాలి కట్టాడు.

యూపీలోని హమీర్​పుర్​కు చెందిన కల్కు ప్రజాపతి అనే యువకుడు.. లాక్​డౌన్ ఉన్నప్పటికీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బరాత్​కు అధికారులు అనుమతించకపోవడం వల్ల మహోబా జిల్లాలోని వధువు గ్రామమైన పునియాకు ఒక్కడే వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే సైకిల్ మీద వంద కిలోమీటర్లు ప్రయాణించాడు.

ఈ సంఘటన గ్రామంలోని బాబా ధ్యానిదాస్ ఆశ్రమంలో ఇరువురికి వివాహం జరిగింది. ఈనెల 28న మంగళవారం వివాహం జరగగా.. బుధవారం అదే సైకిల్ మీద భార్యను తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నాడు ప్రజాపతి.

నాతో పాటు వచ్చేందుకు పోలీసులు ఎవ్వరినీ అనుమతించకపోవడం వల్ల బరాత్​లో ఎవ్వరూ లేరు. పెళ్లిని వాయిదా వేయొద్దని, ఒక్కడివే వెళ్లి వివాహం చేసుకోమ్మని నా స్నేహితులు సలహా ఇచ్చారు. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్నా.. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో చేసుకుంటానని ఊహించలేదు. శారీరకంగా అలసిపోయినప్పటికీ..నా భార్యను ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది.

– కల్కు ప్రజాపతి, వరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.