కేరళలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒక్కరోజే 7,445 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య లక్షా 74 వేలు దాటింది.
మరో 21 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 677కు చేరింది.
మహారాష్ట్రలో ఇవాళ 18 వేల 56 కరోనా కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 39 వేలు దాటింది. ఒక్కరోజే 380 మంది చనిపోయారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 35 వేల 500 మందికి పైగా కొవిడ్‌కు బలయ్యారు. ప్రస్తుతం.. 2 లక్షల 73 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
- కర్ణాటకలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 9,543 మంది కొవిడ్ బారినపడ్డారు. మొత్తం కేసులు 5.75 లక్షల మార్కు దాటింది. ఇవాళ 6 వేల 500 మందికిపైగా డిశ్చార్జి అయ్యారు.
- తమిళనాడులో మొత్తం బాధితుల సంఖ్య 5.80 లక్షల మార్కు దాటింది. ఆదివారం మరో 5,791 కేసుల్ని గుర్తించారు. మరో 80 మరణాలు నమోదయ్యాయి.
- దిల్లీలో వరుసగా రెండోరోజూ 40కి పైగా మరణాలు సంభవించాయి. ఇవాళ 42 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,235కు చేరింది. మరో 3,292 మందికి వైరస్ సోకింది.
- గుజరాత్లో మరో 1411 కేసులు.. 10 మరణాలు నమోదయ్యాయి.