దేశంలో కొవిడ్-19 సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. అందుకు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక వ్యాప్తి ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
వైరస్ ప్రజల్వన కేంద్రాలుగా ఉన్న నగరాల్లో కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు గులేరియా. కరోనా కేసుల పెరుగుదలను పరిగణనలోనికి తీసుకున్నట్లయితే... దిల్లీ వంటి నగరాల్లో వైరస్ ఇప్పటికే తీవ్ర దశకు చేరుకున్నట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా చేరుకోవాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 55 ఏళ్ల వయస్సు వారిపై తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపట్టామని వెల్లడించారు. 1,125 నమూనాలు సేకరించామని అందులో 375 నమూనాలపై తొలి దశ అధ్యయనం చేపడతామన్నారు. 12 నుంచి 65 ఏళ్ల వయసున్న 750 మందిపై రెండోదశ ప్రయోగాలు చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌కు భారత నిఘా వర్గాల తీవ్ర హెచ్చరిక