ETV Bharat / bharat

జాతీయ రహదారులపై టోల్​ వసూళ్లు రద్దు - కోవిడ్- 19 వార్తలు

అత్యవసర సేవల వాహనాలకు ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్​ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది.

toll gates
టోల్​ గేట్స్
author img

By

Published : Mar 26, 2020, 7:21 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో అత్యవసర సేవల వాహనాలకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

"కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టి పెట్టుకుని.. టోల్​ ప్లాజాల వద్ద టోల్​ వసూళ్లను రద్దు చేయాలని ఆదేశించాం. దేశమంతా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర సేవల వాహనాలకు ఇబ్బందులు తగ్గించటమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది."

- నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

టోల్​ వసూళ్లు రద్దు చేసినప్పటికీ.. ప్లాజాల వద్ద రహదారుల నిర్వహణ, అత్యవసర సౌకర్యాలు కొనసాగుతాయని గడ్కరీ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ డే-1: ఎక్కడివారు అక్కడే గప్​చుప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.