ETV Bharat / bharat

'మహా'లో శాంతించని కరోనా.. కొత్తగా 23వేలకుపైగా కేసులు - Covid-19 death toll in India

మహారాష్ట్రలో తాజాగా రికార్డు స్థాయిలో 23వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 328మంది చనిపోయారు. భారత్​లో అత్యధికంగా 35 జిల్లాల్లోనే కరోనా కేసులు బయటపడుతున్నాయి. వీటిపై దృష్టిసారించిన కేంద్ర ఆరోగ్య శాఖ... వైరస్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించింది.

Covid-19 fresh cases and death toll in the nation
ఆ 35 జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు
author img

By

Published : Sep 6, 2020, 8:09 PM IST

Updated : Sep 6, 2020, 10:52 PM IST

మహారాష్ట్రలో రోజురోజుకు రికార్డు సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 23,350 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 328మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 7 వేలు దాటింది.

ఆ జిల్లాలే...

దేశంలో ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 35 జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 17జిల్లాలు, దిల్లీలో 11, పశ్చిమ్​ బంగాలోని కోల్​కతా, హావ్​డా, 24 ఉత్తర పరగణాలు, 24 దక్షిణ పరగణాలు, గుజరాత్​లోని సూరత్​, పుదుచ్చేరి, ఝార్ఖండ్​లోని తూర్పు సింహభూమ్​ జిల్లాల్లోనే భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరీక్షల సామర్థ్యం పెంచి... సానుకూలత రేటును 5 శాతం లోపు తగ్గించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని కోరింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఐదు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​.​

రికార్డు స్థాయిలో రికవరీ రేటు

ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 73,542 మంది వైరస్​ నుంచి కోలుకోవడం వల్ల దేశంలో రికవరీ రేటు 77.32 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 32 లక్షల మంది వైరస్​ను​ జయించారు. మరణాలరేటు 1.72 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య ఇలా..

  • కర్ణాటకలో కొత్తగా 9,319మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 95 మంది మృత్యువాత పడ్డారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో 6,777 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 77 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 66 వేలు దాటింది.
  • తమిళనాడులో ఒక్కరోజే 5,783 మంది కరోనా బారిన పడగా.. 88 మంది మృతి చెందారు. 51,458 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఒడిశాలో ఒక్కరోజులో అత్యధికంగా 3,810 కేసులు నమోదవగా... 8 మంది చనిపోయారు.
  • దిల్లీ తాజాగా 3,256 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా.. 29 మంది మరణించారు.
  • బంగాల్​లో 3,087 కేసులు వెలుగు చూశాయి. మరో 52 మంది చనిపోయారు.
  • కేరళలో కొత్తగా 3,082 మందికి వైరస్​ సోకింది. మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బిహార్​లో కొత్తగా 1,797 కేసులు నమోదయ్యాయి.
  • జమ్ముకశ్మీర్​లో తాజాగా 1,316 కేసులు వెలుగుచూశాయి.
  • హరియాణాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడాకు కరోనా పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి: ప్రభుత్వంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధం!

Last Updated : Sep 6, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.