ETV Bharat / bharat

పెరుగుతున్న రికవరీలు- తగ్గుతున్న మరణాలు - COVID-19 fatality rate declining progressively, total recoveries 9.88 lakh: Health ministry

దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. సరైన వ్యూహాలు అమలు చేయడం వల్ల మరణాల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోందని పేర్కొంది. భారత్​లో మరణాల రేటు ప్రపంచంతో పోలిస్తే తక్కువగా స్పష్టం చేసింది.

COVID-19 fatality rate declining progressively, total recoveries 9.88 lakh: Health ministry
పెరుగుతున్న కరోనా రికవరీలు- తగ్గుతున్న మరణాలు
author img

By

Published : Jul 29, 2020, 7:52 PM IST

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రికవరీల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్​మెంట్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.

భారత్​లో కరోనా మరణాల రేటు ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ రేటు 2.23గా ఉందని, ఏప్రిల్ 1 తర్వాత ఇదే అత్యల్పమని పేర్కొంది.

"మరణాల రేటు తక్కువగా ఉంచడమే కాక, సమగ్ర సంరక్షణ విధానం, సమర్థమైన నియంత్రణ వ్యూహం, అధిక పరీక్షలు, ప్రామాణిక క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లను విజయవంతంగా అమలు చేయడం వల్ల రికవరీలు పెరుగుతున్నాయి. వరుసగా ఆరు రోజుల పాటు రోజుకు 30 వేల మందికి పైగా కోలుకున్నారు."

-కేంద్ర వైద్య శాఖ

ఫలితంగా యాక్టివ్ కేసులకు, రికవరీలకు మధ్య వ్యత్యాసం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బుధవారం ఉదయంతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 35,286 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 9,88,029కి చేరింది. రికవరీ రేటు 64.51 శాతానికి పెరిగింది.

ఇదీ చదవండి: 21వ శతాబ్దం కోసం సరికొత్త జాతీయ విద్యా విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.