ETV Bharat / bharat

కడుపుతో ఉన్నా కరోనాపై పోరు ఆపని తహసీల్దార్​ - KAS officer

దేశవ్యాప్తంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారు. కర్ణాటకలో ఓ తహసీల్దార్​ నిండు గర్భిణి అయినప్పటికీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

COVID-19: Expecting Tehsildar works on field tirelessly
కడుపుతో ఉన్నా కరోనాను లెక్కచేయకుండా పోరు
author img

By

Published : Apr 20, 2020, 9:26 PM IST

కరోనాపై పోరులో భాగంగా వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కర్ణాటకలో ఓ తహసీల్దార్​ నిండు గర్భిణిగా ఉన్నా ప్రజాక్షేమం కోసం కృషి చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

కర్ణాటక తుముకూర్​ జిల్లా సిరా తాలుకాలో నహీదా జామ్​ జామ్​ అనే మహిళ తహసీల్దార్​గా విధులు నిర్వహిస్తున్నారు. 5 నెలల కడుపుతో ఉన్నప్పటికీ.. మహమ్మారిని లెక్కచేయకుండా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రమిస్తున్నారు.

COVID-19: Expecting Tehsildar works on field tirelessly
కడుపుతో ఉన్నా కరోనాను లెక్కచేయకుండా పోరు

ఇప్పటికే ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించింది ప్రభుత్వం. నదియా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తన ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా రోజుకు 12 గంటలు పని చేస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సర్కారుకు నిత్యం నివేదికలను పంపిస్తున్నారు.

నదియా భర్త బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. లాక్​డౌన్​ కారణంగా తన భార్యకు అన్ని పనుల్లో చేయూతగా నిలుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.