దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేసింది. గతంలో వైరస్ కేసులు రెండింతలయ్యేందుకు కేవలం 25.5 రోజులు పట్టేది. అయితే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 73గా మారిందని పేర్కొంది ఆరోగ్యశాఖ.
సానుకూలంగా రికవరీ రేటు
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 81 వేల 514 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 64 లక్షలకు చేరువైంది. ఫలితంగా రికవరీ రేటు మరింత మెరుగై 87.36 శాతంగా నమోదైంది. మరణాల రేటూ మరింత తగ్గి 1.52 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త: పొగతాగేవారికి కరోనాతో అధిక ముప్పు