భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. శరవేగంగా వ్యాపిస్తోన్న మహమ్మారి ధాటికి గత 24 గంటల్లో 704 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 28 మంది ఈ ప్రాణాంతక వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 111కు చేరగా.. 4,821 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ బారినపడిన వారిలో 318 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3851 యాక్టివ్ కేసులున్నట్లు స్పష్టం చేసింది.
అక్కడే అధికం
మహారాష్ట్రపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నేడు మరణించిన 28 మందిలో.. 21 మంది ఆ రాష్ట్రం వారే కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 52కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆ చిన్నారి కోసం... లాక్డౌన్ నిబంధనలు సడలింపు