ETV Bharat / bharat

ఆ చిన్నారి కోసం... లాక్​డౌన్ నిబంధనలు సడలింపు

author img

By

Published : Apr 6, 2020, 8:15 PM IST

Updated : Apr 7, 2020, 7:20 AM IST

కేరళ అలప్పుజకు చెందిన అన్విత అనే చిన్నారి కంటికి సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఏప్రిల్​ 7న తెలంగాణలోని హైదరాబాద్​లో చికిత్స చేయాల్సి ఉంది. లాక్​డౌన్​ వల్ల పాప తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో కేరళ ప్రభుత్వమే రంగంలోకి దిగి.. చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్​కు పంపిస్తోంది.

Baby Anvitha leaves for Hyderabad for treatment
ఆ చిన్నారి కోసం... లాక్​డౌన్ నిబంధనలు సడలింపు
ఆ చిన్నారి కోసం... లాక్​డౌన్ నిబంధనలు సడలింపు

ఓ చిన్నారికి అత్యవసరంగా వైద్యం అందించడం కోసం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్​డౌన్​ నిబంధనలు సడలించాయి. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి, పటిష్ట పోలీసు భద్రతతో రాష్ట్రాల సరిహద్దులు దాటించి గమ్యస్థానానికి చేర్చేందుకు కృషి చేస్తున్నాయి.

ప్రాణాంతక వ్యాధితో పోరాటం

కేరళ అలప్పుజకు చెందిన చెర్తాలా వినీత్​, గోపికల కుమార్తె అన్విత. ఒకటిన్నర ఏళ్ల ఈ చిన్నారి కంటిని ప్రభావతం చేసే 'రెటినోబ్లాస్టోమా' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి అన్వితకు చాన్నాళ్లుగా తెలంగాణ హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. చాలా రోజుల క్రితమే.... ఏప్రిల్​ 7న (రేపటి రోజున) అదే ఆసుపత్రిలో చిన్నారి అన్వితకు కీమోథెరపీ చేయడానికి షెడ్యూల్ ఖరారైంది.

నిస్సహాయస్థితిలో.. ఆశా రేఖ

కరోనా నియంత్రణ కోసం లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.... కేరళలో ఉంటున్న వినీత్​ దంపతులు తమ చిన్నారిని వేరే రాష్ట్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న అలప్పుజ ఎంపీ ఏ.ఎం.ఆరిఫ్​ .... పాప పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కేరళ ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ... అన్విత తల్లిదండ్రులతో మాట్లాడి, పాప ఆరోగ్యం, చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

రంగంలోకి పినరయి విజయన్​

మంత్రి ద్వారా చిన్నారి అన్విత విషయం తెలుసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా​ రంగంలోకి దిగారు. సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) మిషన్ సహాయంతో అన్వితను రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్​ తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇందుకోసం అంతర్​ రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల సహకారం తీసుకున్నారు.

హైదరాబాద్​కు పయనం

కేరళ ప్రభుత్వం అన్విత కోసం ఓ హైటెక్ అంబులెన్స్​ను సిద్ధం చేసింది. పటిష్ట పోలీసు భద్రత నడుమ ఆదివారం ఉదయం 7 గంటలకు అన్విత కుటుంబం అలప్పుజ నుంచి హైదరాబాద్​కు బయలుదేరింది.

మరుసటి రోజే..

చిన్నారి అన్వితకు ఏప్రిల్​ 7న కీమోథెరపీ చికిత్స చేయనున్నారు. ఆ మరుసటి రోజే ఆమె కుటుంబం తిరిగి కేరళకు పయనం కానుంది.

ఇదీ చూడండి: ఆ ప్రాంతాలు మినహా లాక్​డౌన్​ సడలింపు!

Last Updated : Apr 7, 2020, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.