ETV Bharat / bharat

పీఎం కేర్స్​కు 'కోల్​ ఇండియా' రూ.221 కోట్లు విరాళం - PM Cares Fund news

కరోనాపై పోరాటానికి కార్పొరేట్ల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరు ముందుకొస్తున్నారు. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్​ ఇండియా సంస్థ రూ.221 కోట్లు పీఎం కేర్స్​ నిధికి విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్​ఎఫ్​ రూ.25 కోట్ల ఇస్తున్నట్లు తెలిపింది.

Coal India donates
కోల్​ ఇండియా
author img

By

Published : Apr 25, 2020, 6:14 AM IST

కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కార్పొరేట్​ సంస్థలు, పారిశ్రామిక, సినీ, రాజకీయ నేతలు సహాయం అందిచారు. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని కోల్​ ఇండియా (సీఐఎల్​) సంస్థ రూ. 221 కోట్లు 'ప్రైమినిస్టర్​ సిటిజన్​ అసిస్టాన్స్​ అండ్​ రిలీఫ్​ ఇన్​ ఎమర్జెన్సీ సిచ్యూయేషన్​ ఫండ్​' (పీఎం కేర్స్)​కు విరాళంగా అందించింది. సీఐఎల్​లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఒక్కరోజు వేతనం రూ.61 కోట్లను అందించినట్లు అధికారులు తెలిపారు. కోల్​ మైన్​ యజమాని సామాజిక సేవ బాధ్యతలో భాగంగా రూ.160 కోట్లు అందించినట్లు చెప్పారు.

బజాజ్​ ఫినాన్స్​.. రూ.10 కోట్లు

కరోనాపై పోరులో భాగంగా బజాజ్​ ఫిన్​సర్వ్​, దాని అనుబంధ సంస్థలు, ఉద్యోగులు కలిసి పీఎం కేర్స్​కు రూ.10 కోట్లు విరాళంగా అందించినట్లు ప్రకటించింది సంస్థ. 32 వేల మంది ఉద్యోగులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని సహాయంగా అందించినట్లు పేర్కొంది.

జుబిలాంట్​ గ్రూప్​.. రూ.10 కోట్లు

డొమినోజ్​ ఫిజ్జాకు చెందిన జుబిలాంట్​ భారతీయ గ్రూప్ పీఎం కేర్స్​ నిధికి రూ.10 కోట్లు విరాళం అందించింది. 5,300 మంది ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది సంస్థ.

ఎంఆర్​ఎఫ్​.. రూ.25 కోట్లు..

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్​ఎఫ్ కరోనాపై పోరాటానికి రూ. 25 కోట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో జాతీయ స్థాయిలో పీఎం కేర్స్​కు, సంస్థ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: కశ్మీర్​పై పాక్​ కొత్త కుట్రలు- తాలిబన్ల సాయంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.