ETV Bharat / bharat

'కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించాలి'

కరోనా వైరస్​పై పోరాడటంలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులను చికిత్స కోసం వినియోగించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. ప్రైవేటు ఆస్పత్రులు అధిక ధరలు వసూలు చేయకుండా చూడాలని సూచించింది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను వినియోగిస్తున్నాయి.

corona
'కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించాలి'
author img

By

Published : Jun 16, 2020, 7:46 AM IST

కరోనాపై పోరుకు ప్రభుత్వ వైద్య సదుపాయాలు సరిపోవడం లేదన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో వైద్యరంగంలోని ప్రైవేటు సంస్థలను కరోనా సేవల కోసం ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. వైద్య సదుపాయాలను సరైన ధరలకు అందించేలా చూడాలని సూచించింది.

ఆరోగ్య సదుపాయాల కొరత పెరిగిపోతుందని, ఐసీయూ సహా వివిధ వార్డుల్లో పడకలు సరిపోవడం లేదని కేంద్రానికి పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్రం. వైరస్​కు సేవలందించేందుకు ఎక్కువగా ఛార్జీ చేస్తున్నారనే అంశమై కూడా వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలకొన్న వైరస్ పరిస్థితులను పరిశీలించిన కేంద్రం.. ప్రైవేటు ఆరోగ్య నిపుణులు, పడకల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించిందని తెలుస్తోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా స్థానిక ఆస్పత్రి యాజమాన్యాలతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం.

అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు తక్కువ ధరలకే ప్రైవేటు సెక్టార్​లో కరోనా వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకున్నాయని సమాచారం.

ఇదీ చూడండి: మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిందే‌: సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.