భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,701 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 8,78,254 మందికి కొవిడ్ సోకిందని అధికారులు వెల్లడించారు. మరణాలు 23 వేలు దాటాయి. ఇప్పటివరకు 23,174 మంది వైరస్‌కు బలయ్యారు. జులై 12 వరకు 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఆదివారం 2,19,103 టెస్టులు చేశారు.
- మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. 10,289 మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో కేసులు 1,38,740కి చేరాయి. దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొవిడ్ బాధితుల సంఖ్య 1,12,494గా ఉంది. మొత్తంగా 3,371 మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 41,897 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2,047 మంది కరోనా కారణంగా చనిపోయారు