ETV Bharat / bharat

'చైనా నుంచి భారత్​కు ఓడల్లో 63,000 మంది...' - china ships not allowed

చైనా నుంచి ఓడల్లో వచ్చిన 63,000 మంది సిబ్బంది, ప్రయాణికులను భారత నౌకాశ్రయాల్లో దిగకుండా అడ్డుకున్నట్లు నౌకాయాన​ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరందరినీ నిర్దేశించిన ప్రాంతాల్లో ఓడల్లోనే ఉంచినట్లు పేర్కొంది.

63,000 crew, passengers on board ships from China not allowed
'63,000 మందిని ఓడల ద్వారా రాకుండా ఆపివేశాం'
author img

By

Published : May 3, 2020, 4:11 PM IST

కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా చైనా నుంచి ఓడల ద్వారా వచ్చిన 63,000 మంది సిబ్బంది, ప్రయాణికులను భారత నౌకాశ్రయాలలో దిగడానికి నిరాకరించినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. జనవరి 27 నుంచి ఏప్రిల్​ 30 మధ్యకాలంలో 1,990 ఓడలు వచ్చినట్లు వెల్లడించారు.

ఓడలలో వచ్చిన 62,948 మందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు థర్మల్​ స్కీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఎవ్వరికీ నౌకాశ్రయాలలో దిగేందుకు అనుమతి ఇవ్వలేదని, సరకుల దిగుమతి పట్ల జాగ్రత్తగా వ్యవహరించినట్లు వివరించారు.

"మొత్తం 1990 ఓడలలో 1621 ఓడలు భారత్​లోని ప్రధాన ఓడరేవులకు చేరుకున్నాయి. సరకుల ఎగుమతి, దిగుమతి కోసం వీటిని నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఉంచాము" అని అధికారులు చెప్పారు. ఈ రేవుల్లోనే 56,000మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.

భారత్​లో దీన్​దయాళ్​, ముంబయి, జేఎన్​పీటీ, మోర్ముగావ్​, న్యూ మంగళూర్​, కొచ్చిన్, చెన్నై, కమరాజర్​, వీవో చిదంబరనగర్​, విశాఖపట్నం, పారాదిప్, కోల్​కతా ప్రధాన నౌకాశ్రయాలు. 2019-2020లో 705 మిలియన్​ టన్నుల సరకుల రవాణా వీటి ద్వారా జరిగింది.

కరోనా నేపథ్యంలో నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అద్దె మినహాయింపు సహా పలు చర్యలు చేపట్టింది షిప్పింగ్​​ మంత్రిత్వ శాఖ. నౌకాశ్రయాల ప్రాంతంలో ఉన్న అన్ని ఆస్పత్రులకు పీపీఈ కిట్లను సరఫరా చేసింది. ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తరఫున నౌకాశ్రయాలు, పీఎస్​యూలు పీఎమ్ కేర్స్​కు 52 కోట్ల విరాళాన్ని అందించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.