కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిలకు సమన్లుజారీ చేసింది మహారాష్ట్ర ఠానేలోని ఓ న్యాయస్థానం. ఏప్రిల్ 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యను తమ సంస్థకు ముడిపెడుతూ ఆరోపణలు చేశారని వివేక్ చంపనేర్కన్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోర్టులో రాహుల్ గాంధీ, ఏచూరిలపై పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణ సందర్భంగా వారికి సమన్లు జారీ చేసింది న్యాయస్థానం.
రాహుల్, ఏచూరి ఏప్రిల్ 30న కోర్టులో హాజరుకావాలని సివిల్ జడ్జి జేఎస్ భాటియా ఆదేశించారు.
ఇదే అంశంపై రాహుల్ గాంధీ, ఏచూరిలపై మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన దావాను ఇప్పటికే విచారిస్తోంది ముంబయి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.