ఒక కేసులో ఓ వ్యాపారి పేరును తప్పంచడానికి లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుపై దిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సొంత డీఎస్పీనే సీబీఐ అరెస్టు చేసినప్పుడు... అంత పెద్ద ఆరోపణలు ఉన్న నిందితుడిని బహిరంగంగా ఎందుకు తిరగనిస్తున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.
అస్థానా సహా డీఎస్పీ దేవేందర్ కుమార్లను 2018లో సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం వారిరువురికి బెయిల్ లభించింది. చార్జిషీట్లోని కాలమ్ 12లో వారి పేరు నమోదు చేశారు అధికారులు. అప్పటి నుంచి వారిని నిందితులుగా చేర్చడానికి తగిన ఆధారాలు లభించలేదు.
మాంసం ఎగుమతిదారు అయిన మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో అవినీతి ఆరోపణలతో హైదరాబాద్ వ్యాపారి సతీష్ సనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్ అస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసింది.