ETV Bharat / bharat

నాలుగు రోజుల్లో పోక్సో కోర్టు రెండు కీలక తీర్పులు - UP updates

అత్యాచార నిందితులపై కఠినంగా వ్యవహరిస్తోంది యూపీ పోక్సో కోర్టు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు కీలక తీర్పులను వెలువరించింది.

Court delivers justice in 22 days, ensures rapist never walks out alive
అత్యాచారాలపై పోక్సో కోర్టు ఉక్కుపాదం- 4రోజల్లోనే 2తీర్పులు
author img

By

Published : Oct 21, 2020, 2:22 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచార నిందితులపై కఠినంగా వ్యవహరిస్తోంది పోక్సో న్యాయస్థానం. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కేసులో.. జీవిత ఖైదు విధించారు ప్రత్యేక న్యాయమూర్తి వీణా నారాయణ్. అంతేకాకుండా దోషికి రూ. 2లక్షలు జరిమానా కట్టాలని కూడా తీర్పునిచ్చారు. ఈ మేరకు శిక్షను ధ్రువీకరిస్తూ.. పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ హరేంద్ర త్యాగి ఆరోపణలు చేసిన 22 రోజుల్లోనే తీర్పు ఖరారు కావడం గమనార్హం.

ఏమైందంటే.?

అమ్రోహ జిల్లాలో ఆగస్టు 6న.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు దళపత్​ అనే నిందితుడు. ఈ కేసులో అదే నెల 14న నిందుతుణ్ని అరెస్ట్​ చేశారు పోలీసులు.

2018 నాటి కేసులో..

2018లో అమ్రోహ జిల్లాలో 12ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 15న ఇద్దరు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి: 'ఈటీవీ భారత్'​ ఎఫెక్ట్​: హన్సీ ప్రహారికి ప్రభుత్వ ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.