ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఓ 19 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడిని సొంత కుటుంబసభ్యులు సజీవ దహనం చేశారు. ఈ ఘటనను పోలీసులు పరువు హత్యగా పరిగణిస్తున్నారు.

కర్చా గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువతి, ప్రియుడిని పట్టుకున్న ఆమె కుటుంబసభ్యులు.. ఓ గుడిసెలో వారిని బంధించారు. అనంతరం ఆ గుడిసెకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు.
"ఘటన అనంతరం వారిద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే భోలా(23) మరణించాడు. యువతి ప్రియాంకను వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది."
--- మహేంద్ర ప్రతాప్ సింగ్, అదనపు ఎస్పీ.
యువతి కుటుంబానికి చెందిన తొమ్మది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


ఇదీ చూడండి:- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు