జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్లో భారీ బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్రికులకు హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కశ్మీర్లో పర్యటించొద్దంటూ బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు... తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న భారత నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
"మీరు(బ్రిటన్ పౌరులు) జమ్ముకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండండి. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు గమనించండి."
--- బ్రిటన్ ప్రభుత్వ ప్రకటన.
జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలూ తమ దేశస్థులకు ఇలాంటి సూచనలే చేశాయి. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దని హెచ్చరించాయి.
"మీరు(ఆస్ట్రేలియా పౌరులు) ప్రయాణించాలనుకుంటే భద్రతా అంశాలపై అధిక దృష్టి సారించండి. సాధ్యమైనంత వరకు ఆ రాష్ట్రంలో పర్యటించకండి."
-- ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన.
వారం రోజులుగా జమ్ముకశ్మీర్‌కు భారీ సంఖ్యలో బలగాలను తరలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థితులకు గల కారణాలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.
ఇదీ చూడండి- ఆపరేషన్ కశ్మీర్: భయాందోళనల్లో స్థానికులు