ETV Bharat / bharat

'బలగాల ఉపసంహరణపై భారత్​- చైనా కీలక నిర్ణయం'

Corps Commander level talks
బలగాల ఉపసంహరణపై భారత్​-చైనా కీలక నిర్ణయం
author img

By

Published : Jun 23, 2020, 12:36 PM IST

Updated : Jun 23, 2020, 1:07 PM IST

12:32 June 23

'బలగాల ఉపసంహరణపై భారత్​- చైనా కీలక నిర్ణయం'

గల్వాన్​ లోయలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా భారత్​- చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారానికి వచ్చాయి. సోమవారం జరిగిన సైనిక చర్చల ద్వారా ఈ మేరకు పురోగతి సాధించినట్లు భారత సైన్యం వెల్లడించింది. 

"మోల్డోలో సోమవారం కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు సానూకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారం కుదిరింది. తూర్పు లద్దాఖ్​లోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై విస్తృత చర్చ జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెండు దేశాల సైన్యాలు అమలు చేస్తాయి."

-భారత సైన్యం ప్రకటన

Last Updated : Jun 23, 2020, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.