కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికులు తగ్గటం వల్ల ఇదివరకే 155రైళ్లను నిలిపివేస్తున్న ప్రకటించిన అధికారులు తాజాగా మరో 90 రైళ్లు రద్దు చేస్తునట్లు తెలిపారు. మార్చి 20 నుంచి 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 245 రైళ్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
"టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రతి ప్రయాణికుడికి వ్యక్తిగతంగా రైళ్లు రద్దు చేసినట్లు సమాచారం అందించాం. టికెట్ల రద్దుపై ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు. వారి డబ్బును 100శాతం తిరిగి చెల్లిస్తాం. ప్రజలు అనవసరమైన ప్రయాణాలు చేయకుండా రైళ్లను రద్దు చేస్తున్నాం. సామాజిక దూరం పాటించేలా చేయడం మా బాధ్యత. తక్కువ మంది ప్రయాణికులు ఉన్న రైళ్లను మాత్రమే రద్దు చేస్తున్నాం."
- రైల్వే అధికారులు
ఇప్పటికే రైల్వే సిబ్బందిలో కరోనా లక్షణాలు ఉన్నవారిని విధులకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇప్పటి వరకు 223మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: 'కరోనా' ప్రమాదకరమైన వైరస్ కాదు: సీసీఎమ్బీ డైరెక్టర్