ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే చైనా, జపాన్ నుంచి అక్కడి భారతీయులు చాలా మంది స్వదేశానికి చేరుకున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రంగా ఉన్న ఇరాన్‌లోని భారతీయుల్ని ప్రత్యేక విమానం ద్వారా భారత్‌కు తీసుకురానున్నారు.
ఇరాన్‌కు చెందిన మహన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం 300 మందిని తీసుకురానుంది. ఈ ప్రయాణికులను సిబ్బంది.. పూర్తిగా స్క్రీనింగ్ చేస్తున్నట్లు భారత విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఈ రాత్రికల్లా దిల్లీకి చేరుకుంటారని వెల్లడించారు. అదే విమానం.. ఇక్కడి ఇరాన్ దేశస్థులను తీసుకెళ్తుందని సమాచారం.
ఇదీ చూడండి:చైనాలో కరోనా ధాటికి మరో 30 మంది మృతి