ETV Bharat / bharat

వైద్యులపై దాడిచేస్తే ఇక ఏడేళ్ల జైలు.. కేంద్రం నిర్ణయం - law

కరోనాపై యావత్‌ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. కొవిడ్​పై పోరుకు ఇది వరకే ప్రకటించిన రూ. 15 వేల కోట్ల ప్యాకేజీకీ కేబినెట్​ ఆమోదముద్ర వేసింది.

Coronavirus Ordinance
వైద్యులపై దాడిచేస్తే ఇక ఏడేళ్ల జైలు.. ఆర్డినెన్స్​ జారీ
author img

By

Published : Apr 23, 2020, 5:15 AM IST

కొవిడ్​ రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సిద్ధమైంది. దాడులకు పాల్పడితే రూ.5 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం కల్పించేలా 'జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897'కి సవరణ చేయనున్నారు. దీన్ని వెంటనే అమల్లోకి తెస్తూ అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) జారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని భారత వైద్య సంఘం (ఐఎంఏ) నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. అనంతరం.. ఐఎంఏ తమ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకొంది.

వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించిన కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌. కోర్టులు ఏడాది లోపు తీర్పు వెలువరిస్తాయన్నారు. వైద్య సిబ్బందిపై చేసే నేరాలన్నీ బెయిల్‌కు వీల్లేని కేసుల కిందే పరిగణించనున్నట్లు తెలిపారు. వైద్యుల వాహనాలు, క్లినిక్‌లు, ఇళ్లపై దాడులు చేసి నష్టం కలిగించిన వారి నుంచి ఆ నష్టానికి రెండు రెట్ల పరిహారం వసూలుచేసే నిబంధననూ ఈ ఆర్డినెన్స్‌లో చేర్చినట్లు తెలిపారు.

కేబినెట్​ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు....

ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారులు ప్రస్తుత పరిస్థితుల్లో నాన్‌ ఎంపానెల్డ్‌ కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్నా వారికి ఉచితంగా వైద్యసేవలు అందించడానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు జావడేకర్‌ చెప్పారు.

పొటాష్‌, ఫాస్ఫాటిక్‌ ఎరువులపై రాయితీ పెంపు

  • ఫాస్ఫాటిక్‌, పొటాష్‌ ఎరువులపై రాయితీని 5 నుంచి 7% పెంచాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది రూ.22,186 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుందన్నారు.
  • కొవిడ్‌-19 నివారణకు ఇదివరకే ప్రకటించిన రూ.15,000 కోట్ల ప్యాకేజీకి కేబినెట్‌ ఇప్పుడు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.
  • ఇండియన్‌ మెడికల్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌’, ‘హోమియోపతిక్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌’ ఏర్పాటుకు వీలుగా కూడా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రపతి ఆమోదం

విమాన ప్రయాణాలు ఎప్పటినుంచి ప్రారంభించాలో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదని జావడేకర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30% కోత వంటి ప్రతిపాదనలపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు చెబుతామని బదులిచ్చారు. కేబినెట్‌ ప్రతిపాదించిన ఆర్డినెన్సును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం రాత్రి ఆమోదించారు.

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కొన్ని ప్రాంతాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతున్న దృష్ట్యా వారికి తగినంత రక్షణ కల్పించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. కరోనాతో చనిపోయారని భావించిన వైద్య నిపుణులకు అంత్యక్రియలైనా జరపనివ్వకుండా అడ్డుకుంటున్న దారుణ ఉదంతాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా దీనిలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలా అడ్డుపడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య సిబ్బందికి 24 గంటలూ అందుబాటులో ఉండేలా రాష్ట్ర, జిల్లాల స్థాయుల్లో నోడల్‌ అధికారులను నియమించాలని తెలిపారు.

ఆరోగ్య సిబ్బంది రక్షణపై రాజీ లేదు

''కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది రక్షణ విషయంలో ఎలాంటి రాజీకి తావు ఉండదు. ఈ విషయంలో కేంద్ర సర్కారు చిత్తశుద్ధిని.. కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్సు చాటుతుంది. వైద్య నిపుణులు సహా ఆరోగ్య సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడమే ఆర్డినెన్సు ధ్యేయం.''

- ట్విటర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.