18 రాజ్యసభ సీట్లకు జరగాల్సిన ఎన్నికలు.. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధంగా తమకున్న అధికారాలను ఉపయోగించుకుని.. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.
మార్చి 26నే పూర్తి కావాల్సిన ఎన్నికల ప్రక్రియ.. కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయట పడిన తర్వాతే నూతన ఎన్నికల తేదీ ప్రకటించనున్నట్లు వెల్లడించింది ఈసీ.
రాజ్యసభలో మొత్తం 55 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. కానీ 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం వల్ల 18 సీట్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్(4), జార్ఖండ్(2), మధ్యప్రదేశ్(3), మణిపూర్(1), రాజస్థాన్(3), గుజరాత్(4), మేఘాలయ(1) సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇదీ చూడండి : కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు