దేశంలో వైరస్ కేసుల సంఖ్య 37,776మందికి పెరిగింది. ఇప్పటివరకు 1,223మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 26,535గా ఉంది.
మహారాష్ట్రలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఇవాళ మరో 790మందికి కరోనా సోకింది. కొత్తగా 36 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 12,296కు చేరింది. 521మంది మృతి చెందారు. ఒక్క ముంబైలోనే 547మందికి కొత్తగా వైరస్ సోకింది. 27మంది మృతి చెందారు.
గుజరాత్లో ఒక్కరోజులో 26మంది..
గుజరాత్లో మరో 333మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 26మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 5054కు చేరింది. ఇప్పటివరకు 262మంది మృతి చెందారు. 160మందికి కొత్తగా వైరస్ నయమైంది.
తమిళనాడులో వృద్ధురాలు మృతి..
తమిళనాడులో వైరస్ కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. మొత్తంగా మరణాల సంఖ్య రాష్ట్రంలో 29కి చేరింది. కొత్తగా 231 మందికి కరోనా సోకిన నేపథ్యంలో బాధితుల సంఖ్య 2757కు పెరిగింది.
దిల్లీలో..
దిల్లీలో వైరస్ బాధితుల సంఖ్య 3,738కి చేరింది. అక్కడ 61మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 127మందికి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజులో 127మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 2,455కు పెరిగింది. రాష్ట్రంలో 1756 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 43మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో 12మందికి వైరస్..
కర్ణాటకలో మరో 12మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 601కి చేరింది. 271మందిలో వైరస్ నయమైంది. మరో 297 మంది ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకు 25మంది కరోనాకు బలయ్యారు.
కేరళలో రెండు కేసులు..
కేరళలో 24 గంటల వ్యవధిలో రెండు వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వయనాడ్‌లో ఒక కేసు నమోదు కాగా.. ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ నుంచి తొలగించారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 499కి పెరిగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
హరియాణాలో 19మందికి..
హరియాణాలో తాజాగా 19మంది వైరస్ బాధితులుగా మారారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకినవారి సంఖ్య 376కు చేరింది. తాజాగా ఒకరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మరణాల సంఖ్య ఐదుకు చేరింది.
రాజస్థాన్‌లో 20 రోజుల శిశువు..
రాజస్థాన్ జైపుర్‌లో కరోనాతో 20 రోజుల నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి సహా మరో ఇద్దరు తాజాగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడ మరణాల సంఖ్య 36కు చేరింది. కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 2,720కి పెరిగింది.
జమ్ముకశ్మీర్‌లో మరో 27మందికి..
జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 27మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 666కు చేరింది. ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లో ఇద్దరు..
మధ్యప్రదేశ్‌లో మహమ్మారి బారినపడి కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 74కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 32 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బాధితుల సంఖ్య అక్కడ 2719కి చేరింది.
ఒడిశాలో ఐదుగురికి వైరస్ పాజిటివ్..
ఒడిశాలో మరో ఐదుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 154మంది వైరస్ బాధితులుగా మారారు. ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
బంగాల్లో 48కి పెరిగిన మృతులు..
బంగాల్లో కొత్తగా 70మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 795కు చేరింది. 24 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరింది.
17మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి..
17మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది. దిల్లీకి చెందిన బెటాలియన్ల జవాన్లకు వైరస్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్ రూపాంతరం చెందుతోందా?