ETV Bharat / bharat

కరోనాతో అప్పుడు 70వేలు.. ఇప్పుడు 62వేలు - Corona updates

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే విమానాల ద్వారా దేశానికి వచ్చే వారి సంఖ్య 62వేలకు తగ్గినట్టు పౌరవిమానయాన సహాయమంత్రి హర్​దీప్​ సింగ్ పూరి వెల్లడించారు.

Coronavirus: Daily int'l passenger arrivals falls to 62,000
కరోనాతో అప్పుడు 70వేలు.. ఇప్పుడు 62వేలు
author img

By

Published : Mar 12, 2020, 5:11 PM IST

విమానాల ద్వారా ప్రతి రోజు 70వేల మంది భారత్​కు వస్తుంటారు. అయితే కరోనా వైరస్​ వల్ల ఈ సంఖ్య 62వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయమంత్రి హర్దీప్​ సింగ్​ పూరి లోక్​సభలో వెల్లడించారు. పర్యటనలపై ప్రభుత్వం జారీ చేసిన సూచనల వల్ల.. రానున్న రోజుల్లో ఇది 40వేలకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తికి స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు హర్దీప్​ సింగ్​.

కరోనాను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. పర్యటక వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది.

ఇరాన్​ నుంచి..

ఇరాన్​లో చిక్కుకున్న భారతీయ యాత్రికులను దేశానికి రప్పించడంపై దృష్టి సారించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు.

"ప్రస్తుతం ఇరాన్​లో కరోనా విస్తరణ ఆందోళనకరంగా ఉంది. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చైనా, జపాన్ ​నౌకలోని భారతీయులను స్వదేశానికి రప్పించాం. అత్యవసరమైతే ప్రయాణాలు చేయవద్దని సూచించారు. దాదాపు 6000మంది భారతీయులు ఇరాన్​లో చిక్కుకుపోయారు. అందులో 1100మంది యాత్రికులున్నారు. వీరు మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​కు చెందినవారు. 300మంది విద్యార్థులూ ఉన్నారు. తమిళనాడు, కేరళ, గుజరాత్​కు చెందిన 1000మంది ఉన్నారు."

-జైశంకర్​, విదేశాంగమంత్రి.

ఇరాన్​కు పరిమిత సంఖ్యలో కమర్షియల్​ ఫ్లైట్లు పంపడానికి భారత యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్టు వివరించారు జైశంకర్​.

ఇదీ చదవండి: 'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.