ETV Bharat / bharat

దేశంలో 315 మందికి కరోనా- పలు రాష్ట్రాల్లో ఆంక్షలు - భారతదేశంలో కరోనా వైరస్

భారత్​లో కరోనా కేసుల సంఖ్య 315కి చేరింది. శనివారం కొత్తగా 60 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 23 మంది కొవిడ్- 19 నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 మంది వైరస్​ సోకగా అసోంలో నాలుగున్నరేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చింది.

CORONA
కరోనా
author img

By

Published : Mar 22, 2020, 5:10 AM IST

Updated : Mar 22, 2020, 9:15 AM IST

దేశంలో 315 మందికి కరోనా- పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

దేశంలో నెమ్మదిగా ప్రారంభమైన కరోనా వైరస్​ క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 315 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. శనివారం ఒక్క రోజే 60 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 16,021 మందికి చెందిన 16,911 నమూనాలు పరీక్షించినట్లు తెలిపింది.

ఈ 315 మందిలో 17 మంది ఇటాలియన్లు సహా 39 మంది విదేశీయులున్నారు. దిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచి ఒక్కో కరోనా మరణం నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 315 కరోనా కేసులలో మహారాష్ట్రలో అత్యధికంగా 63 మంది కొవిడ్-19 బాధితులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులు సహా ఇప్పటివరకు మొత్తంగా 40 మందికి కరోనా తేలింది.

వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా..

రాష్ట్రంకేసుల సంఖ్య
మహారాష్ట్ర 63
కేరళ 40
దిల్లీ 27
ఉత్తర్​ప్రదేశ్ 24
తెలంగాణ 21
రాజస్థాన్​- హరియాణా 34
కర్నాటక 15
పంజాబ్- లద్ధాఖ్​ 26
గుజరాత్​ 7
జమ్ముకశ్మీర్ 4
ఆంధ్రప్రదేశ్- ఉత్తరాఖండ్- బంగాల్​ 9
ఒడిశా 2
పుదుచ్చేరి- ఛత్తీస్​గఢ్​- చండీగఢ్ 3

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారిలో 23 మంది పూర్తిగా కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 306 మందిని ముంబయిలో ఐసోలేషన్​లో ఉంచినట్లు బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.

రేపటి నుంచి ఈ నెల 31 వరకు పుదుచ్చేరిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మహారాష్ట్ర ఠాణేలో 10 మందికి మించి గుమిగూడడంపై నిషేధం విధించారు. అసోంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగున్నరేళ్ల చిన్నారికి వైరస్​ సోకినట్లు అదికారులు తెలిపారు.

ధరల అదుపు...

శానిటైజర్లు, మాస్కుల ధరలు ఇష్టారీతిన పెంచడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 200 మిల్లీలీటర్ల శానిటైజర్​ను రూ.100కే విక్రయించాలని, మాస్కు గరిష్ఠ ధర రూ.8గా నిర్దేశిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అత్యవసరమైన ఔషధాలను భారత్లోనే తయారు చేయాలని దేశీయ సంస్థలకు సూచించారు ప్రధాని మోదీ. ఈ మేరకు వివిధ పథకాల కింద రూ.14 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

కొవిడ్19కి సంబంధించిన ఆర్​ఎన్​ఏ డయాగ్నస్టిక్ కిట్లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలని ఔషధ సంస్థలకు సూచించారు మోదీ. కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల ఖర్చు కూడా రూ.4,500 కోట్లకు మించరాదని ప్రైవేట్ ల్యాబులకు కేంద్రం సూచించింది.

విదేశాల్లోని భారతీయులపై..

భారత్​లో గత అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమానసేవలు రద్దుకాగా ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సూచించాయి. వారికోసం ప్రత్యేక హెల్ప్​లైన్లు ప్రారంభించాయి. మలేసియాలో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Last Updated : Mar 22, 2020, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.