ETV Bharat / bharat

దేశంలో 258కి చేరిన కరోనా కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా 258 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 39 మంది విదేశీయులు ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

coronavirus-cases-rise-to-258-in-india-health-ministry
దేశంలో 258కి చేరిన కరోనా కేసుల సంఖ్య
author img

By

Published : Mar 21, 2020, 10:11 AM IST

భారత్​ను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 258కి చేరింది. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో 39 మంది విదేశీయులని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

"దేశవ్యాప్తంగా 258 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. అయితే వీరిలో 23 మంది కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు."

--- కేంద్ర ఆరోగ్యశాఖ.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం వల్ల మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మరణించారు. వైరస్​ కట్టడికి చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం.

కేరళ, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, రాజస్థాన్​, లద్దాఖ్​లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఇదీ చూడండి:- కరోనా వ్యాప్తిని అరికట్టే ఆయుధాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.