దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్యను 10 నుంచి 9కి తగ్గించింది కేంద్ర ఆరోగ్యశాఖ. దిల్లీలో ఓ వ్యక్తి వైరస్ కారణంగా మరణించాడని భావించినప్పటికీ.. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
ఇప్పటివరకు మహారాష్ట్రలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్, కర్ణాటక, గుజరాత్, దిల్లీ, పంజాబ్, బంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కరు చొప్పున మరణించారు.
పెరుగుతున్న కేసులు...
దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 562మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. వీరిలో 41మంది విదేశీయులున్నారు. మొత్తం 41మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అత్యధికంగా కేరళలో 109 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 101, కర్ణాటకలో 41, ఉత్తరప్రదేశ్‌లో 35, గుజరాత్లో 33 మంది వైరస్ బారినపడ్డారు.
ఇదీ చూడండి:- కరోనాపై విజయం సాధిస్తే ఇక నిత్యం ఉగాదే!