ETV Bharat / bharat

అన్ని అవయవాలపైనా కరోనా ముప్పేట దాడి! - శరీర అవయవాలపై కరోనా దాడి

కరోనా వైరస్.. మనిషి శరీరంలోకి ప్రవేశించి ఉపిరితిత్తులపైనే ప్రధానంగా దాడి చేస్తుందని మనకు తెలుసు. అయితే శరీరంలోని ఇతర భాగాలపైనా వైరస్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా రోగుల లక్షణాలు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చారు.

corona
కరోనా
author img

By

Published : Apr 25, 2020, 7:23 AM IST

కరోనా వైరస్‌ కమ్ముకుంటూ... మనిషి ఆయువు తీసేస్తోంది. ఇది ఊపిరితిత్తులపై మాత్రమే దాడి చేస్తోందని ఇన్నాళ్లూ అనుకుంటూ ఉన్నాం. కానీ అలా ఊహిస్తే తప్పులో కాలేసినట్లే!! మనిషి శరీరంలోని అన్ని అవయవాలూ ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకుంటున్నాయి. కళ్లు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు.. ఇలా ప్రతి అవయవాన్నీ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని లండన్‌ కింగ్స్‌ కాలేజీ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్‌ అజయ్‌ షా చెబుతున్నారు. తమ ఆసుపత్రిలో చేరిన రోగుల లక్షణాలను పరిశీలించిన తర్వాత ఆయన ఈ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఎటువంటి లక్షణాలు బయటపడని రోగులతోపాటు, వ్యాధి తగ్గిందనుకునేలోపే తిరగబెడుతున్న రోగుల్లోనూ ఈ వైరస్‌ అలజడి సృష్టిస్తోందని ఆయన వివరించారు. అజయ్‌షా చెప్పిన విషయాల్ని 'ది టెలిగ్రాఫ్‌' పత్రిక తాజాగా ప్రచురించింది.

corona
కరోనా దాడి తీరు

ముక్కు నుంచి గొంతులోకి..

కరోనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించడానికి అత్యంత అనుకూలమైన మార్గం ముక్కు. తొలుత ఇది నాసికా రంధ్రాల్లో తిష్ఠవేస్తుంది. ఆ సమయంలో వాసన చూడటంలో రోగి సమస్యలను ఎదుర్కొంటాడు. వైరస్‌ ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోని మృదు చర్మంలో ఈ క్రిమి నిలిచేందుకు అవసరమైన ఏసీఈ2 సమృద్ధిగా ఉంటుంది. వైరస్‌కు ఉండే కొమ్ముల(స్పైక్‌) ప్రొటీన్‌ ఆసరాగా అక్కడ కణాల్లో చొరబడి పునరుత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా.. చుట్టుపక్కల వారికి విపరీతంగా అంటించడంలో ఇది కీలకమైన దశ. వైరస్‌ గొంతులోకి ప్రవేశించిన తొలి దశలో మన రోగ నిరోధక కణాలు స్పందించకుంటే గాలిగొట్టం నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.

ఊపిరితిత్తుల్లో అలజడి..

ఊపిరితిత్తుల్లోకి చేరగానే వైరస్‌ విజృంభిస్తుంది. అక్కడ లక్షల సంఖ్యలో ఉండే శ్వాసకోశాలను ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో 'న్యుమోనైటిస్‌' అనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల కండరాల్లో వాపు కనిపిస్తుంది. రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. అదేసమయంలో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి భారంగా మారుతుంది. కొందరురోగుల్లో 'అక్యూట్‌ రెస్పిరేటరి డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌' కనిపిస్తుంది. అప్పుడు రక్తంలో ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి తగ్గిపోతుంది. ఈ దశలో వెంటిలేటర్లు వాడి రోగి ప్రాణాలను కాపాడొచ్చు. అలాగని వైరస్‌ వ్యాప్తిని ఆపలేం. బాధితుడిలోని వ్యాధి నిరోధక కణాలు బలపడి వైరస్‌ను ఎదుర్కొనే వరకు వేచి ఉండాల్సిందే. ఈ దశలో చాలా మంది రోగుల్లో శరీరం అతిగా స్పందించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగ నిరోధక కణాలు అదుపుతప్పి శరీర భాగాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశలో శరీరం మొత్తం వాపు ప్రక్రియ పెరిగిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రక్తనాళాల్లో వాపు వస్తుంది. దీంతో 20 శాతం రోగుల్లో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఇది గుండె సమస్యలకు సైతం కారణం అవుతోందని భావిస్తున్నారు. అందుకే ఐసీయూల్లో చనిపోయేవారు 'సైటోకైన్‌ స్ట్రామ్‌'తో, వివిధ అవయవాలు పనిచేయక పోవడం వల్ల ప్రాణాలు వదులుతున్నారు.

గుండెపై ఒత్తిడి పెంచి..

ఈ వైరస్‌ గుండె, రక్తనాళాలపై ఎలా దాడి చేస్తోందనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. శరీరంలోని రక్తనాళాల గోడలపై దాడి చేసి వాపును సృష్టిస్తోంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తోంది. చైనాలోని వుహాన్‌లో 416 మంది కరోనా బాధితులపై నిర్వహించిన పరిశోధనలో 20 శాతం మంది గుండె సమస్యలతో మరణించినట్లు 'జామా కార్డియాలజీ జర్నల్‌' పేర్కొంది. కొవిడ్‌ తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మధుమేహం, గుండెజబ్బులు ఉన్న వారికి ఇది ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.

కాలేయం దెబ్బతిని..

వైరస్‌ ముదిరిపోయి ఆసుపత్రిలో చేరిన రోగుల కాలేయాల్లో ఎంజైమ్‌ల శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఫలితంగా కాలేయం పనితీరు దెబ్బతింటోంది. ఈ పరిస్థితికి కారణం రోగి వాడే ఔషధాలా? లేక వ్యాధినిరోధక శక్తి అతిగా స్పందించడమా..? అనే దాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

ముదిరితే మూత్రపిండాలకు ముప్పు

కొవిడ్‌ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న 85 మందిపై వుహాన్‌లో చేసిన పరిశోధనలో 27% రోగుల మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కిడ్నీల్లో వైరస్‌కు అనుకూల రిసెప్టర్లు ఎక్కువగా ఉండటంతో నేరుగా దాడి చేస్తోందా?.. లేక రక్తపోటు పెరగడం వంటి లక్షణాల కారణంగా దెబ్బతింటున్నాయా? తేలలేదు.

మెదడుకూ ఇబ్బందే...

జపాన్‌లోని ఒక రోగిలో మెదడువాపు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి మెదడులోని ద్రవాల్లోనూ వైరస్‌ను గుర్తించారు. దీంతో కరోనా వైరస్‌ కేంద్రనాడీ వ్యవస్థలోకి సైతం చొచ్చుకు పోగలదని అనుమానిస్తున్నారు. దీంతోపాటు మూర్ఛ, తలనొప్పి వంటి లక్షణాలు బయటపడుతున్నాయి.

"చాలా మంది రోగులు అయోమయంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వారి మెదడులో ఏదో జరుగుతోందనే అర్థం. వైరస్‌ నేరుగా మెదడుపై దాడి చేసైనా ఉండాలి.. లేదా శరీరంలో ప్రాణవాయు శాతం తగ్గడంతో అయినా కావాలి. ఇప్పటికీ ఏదీ కచ్చితంగా చెప్పలేం"

- డాక్టర్‌ డంకన్‌ యంగ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ది నుఫీల్డ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో క్లినికల్‌ న్యూరోసైన్సెస్‌ విభాగం ప్రొఫెసర్‌)

"గుండెపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం వంటి సమస్యలను మేం గుర్తించాం. కాకపోతే ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ రోగుల్లో బయటపడే సమస్యల మూలాలను గుర్తించేందుకు పరిశోధనలు మాత్రం కొనసాగుతున్నాయి." - ప్రొఫెసర్‌ అజయ్‌ షా (కింగ్స్‌ కాలేజ్‌ ఆసుపత్రి, లండన్‌)

ఇదీ చదవండి: దేశంలో ఒక్క రోజులోనే 1,750 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.