ETV Bharat / bharat

'మహా'లో కరోనా తీవ్రం.. ఒక్కరోజులో 3,721 కేసులు - Covid-19 death toll in Tamilnadu

భారత్​లో కొవిడ్​-19 బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 3,721మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 62 మంది మరణించారు. దిల్లీ, తమిళనాడు, గుజరాత్​ల్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.

Coronavirus: 2,710 new Covid-19 cases and 37 deaths reported in Tamil nadu
తమిళనాడులో కరోనా తీవ్రం.. ఒక్కరోజులో 2,710 కేసులు
author img

By

Published : Jun 22, 2020, 8:09 PM IST

Updated : Jun 22, 2020, 10:15 PM IST

దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్ర, దిల్లీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 3,721 మందికి వైరస్​ సోకింది. 24 గంటల వ్యవధిలో 62మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య మొత్తంగా 1,35,796కు చేరింది. 6283 మంది మహమ్మారికి బలయ్యారు.

దిల్లీలో ఉద్ధృతంగా కరోనా

దేశ రాజధానీ దిల్లీలో కరోనా ఉద్ధృతంగా మారింది. ఒక్కరోజులో 2,909 వైరస్ బారినపడ్డారు. మరో 58మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 62,655కు పెరిగింది. చనిపోయినవారి సంఖ్య 2,223కు చేరింది.

తమిళనాడు విలవిల

తమిళనాడులో ఒక్కరోజులో 2,710 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 62,087కి పెరిగింది . కొత్తగా 37మంది కొవిడ్-19​తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 794కు పెరిగింది.

మరో 563 మందికి..

గుజరాత్​లో 24 గంటల్లో 563మంది వైరస్ బారినపడ్డారు. మరో 21మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 27,880కి పెరిగింది. మరణాలు 1685కు చేరాయి.

బంగాల్​ పెరుగుతున్న కేసులు

బంగాల్లో ఒక్కరోజులో 413మందికి కొవిడ్​-19 నిర్ధరణ అయింది. కొత్తగా 14మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 14,358కు పెరిగింది. మృతుల సంఖ్య 569కి చేరింది.

రాజస్థాన్​లో కొత్తగా ఏడుగురు..​

రాజస్థాన్​లో తాజాగా 302మందికి వైరస్​ సోకింది. మరో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 15,232కు చేరింది. ఇప్పటివరకు 356మంది చనిపోయారు.

కర్ణాటకలో 10వేలకు చేరువలో కేసులు..

కర్ణాటకలో కొత్తగా 249 మందికి కరోనా సోకింది. మరో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 9,399 చేరగా.. మరణాల సంఖ్య 142కి ఎగబాకింది.

ఎమ్మెల్యేకు కరోనా

బిహార్​లో భాజపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​ అని తేలింది. చికిత్స కోసం ఆయనను పట్నాలోని ఎయిమ్స్​కు తరలించారు. బిహార్​లో ఇవాళ 206 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,808కి పెరిగింది. ఇప్పటివరకు 52మంది వైరస్​తో మృతి చెందారు.

అక్కడ 177 కేసులు..​

పంజాబ్​లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా 177 మందికి కరోనా సోకింది. మరో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,235కు పెరిగింది. మృతుల సంఖ్య 101కి చేరింది.

మరో 138 కేసులు...

కేరళలో కొత్తగా 138 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,310 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం 21 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: సరిహద్దు ఉద్రిక్తం- ఇరువైపులా వెయ్యిమంది మోహరింపు

Last Updated : Jun 22, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.