ప్రతి కుటుంబానికి రూ.7500 అందించాలి: సోనియా
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దేశంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా ప్రభావం, పరిణామాలపై నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా రైతులు, కూలీలు, వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. గత మూడు వారాల్లో వైరస్ ఉద్ధృతి పెరిగిందని వివరించారు. వాణిజ్య, వ్యాపారాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అనేక మంది జీవితాలు చిన్నాభిన్నయ్యాయన్నారు సోనియా. లాక్‌డౌన్ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రతి కుటుంబానికి అత్యవసర సాయం కింద రూ.7,500 అందించాలన్నారు. సమష్టిగా కరోనాపై పోరాడాల్సిన సమయంలో ద్వేషం, మతం అనే వైరస్ వ్యాప్తికి భాజపా పాల్పడుతోందన్నారు సోనియా.
లాక్డౌన్పై పోరాటంలో విజయం సాధించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారం ఎంతో కీలకమన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.