ETV Bharat / bharat

కరోనా కలవరం: మహారాష్ట్రలో 24 గంటల్లో 466 పాజిటివ్​ కేసులు - కొవిడ్​ వార్తలు తాజా

coronavirus
కరోనా
author img

By

Published : Apr 20, 2020, 8:56 AM IST

Updated : Apr 20, 2020, 10:18 PM IST

21:09 April 20

బ్రిటన్​లో కొత్తగా 449 మరణాలు

కరోనా సోకి బ్రిటన్​లో మరో 449 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు సంఖ్య 16,509కి చేరింది. పాజిటివ్​ కేసుల సంఖ్య 124,743కి పెరిగింది.

20:41 April 20

కర్ణాటకలో 400 మార్క్ దాటిన కేసులు..

కర్ణాటకలో మరో 18మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 408కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16మంది మృతి చెందారు. 12మందికి వైరస్ నయమైంది. 280 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

20:22 April 20

గుజరాత్​లో మరో నలుగురు..

గుజరాత్​లో వైరస్ కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 71కి చేరింది. రాష్ట్రంలో మరో 93మందికి కరోనా సోకింది. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1939కి పెరిగింది. 106మందికి వైరస్ నయమైంది.

20:14 April 20

'మహా'రాష్ట్రలో 466 కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. గత 24 గంటల్లో 466 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 4,666కి చేరింది. నేడు 9 మంది చనిపోవడం వల్ల మరణాల సంఖ్య 232కి చేరింది. మొత్తం 572 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

19:21 April 20

ధారవిలో పెరుగుతున్న కేసులు..

మహారాష్ట్రలోని ధారవిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 30 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 168కి చేరింది. 11 మంది ఇప్పటివరకు మృతి చెందారు.

18:54 April 20

తమిళనాడులో 43 కేసులు...

తమిళనాడులో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య మొత్తం 1,520కి చేరింది. ఇందులో 457 మంది కోలుకోగా.. మొత్తం 17 మంది చనిపోయారు.

18:43 April 20

బంగాల్​లో 54 కేసులు..

బంగాల్​లో మరో 54 కొవిడ్​ కేసులు నమోదయ్యయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 339కి చేరింది. ఇందులో 245 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

18:36 April 20

కేరళలో 6 కేసులు..

కేరళలో మరో 6 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 408కి చేరింది. ఇందులో 114 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 21 మంది డిశ్చార్జి అయ్యారు.

18:28 April 20

ఉత్తరప్రదేశ్​లోని 45 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

కరోనా కట్టడి కోసం కీలక చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ సరిగ్గా పాటించని 40 జిల్లాల్లో.. ఇకపై కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. ఇటీవలె ప్రభుత్వం సర్వే చేయగా... మొత్తం 75 జిల్లాల్లో 40 జిల్లాల్లో ప్రజలు లాక్​డౌన్​ ఖాతరు చేయట్లేదని తేలిందట. ఫలితంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

18:18 April 20

రికార్డుల స్థాయిలో తగ్గిన కేసులు...

ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొవిడ్​-19 కేసులు గణనీయంగా తగ్గాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క కేసూ నమోదుకాలేనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,619 కేసులు నమోదవగా.. 71 మంది చనిపోయారు. 4,258 మంది కోలుకున్నారు. 50 మంది మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

17:55 April 20

corona latest info by helath ministry
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు...

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా వైరస్​ బాధితుల సంఖ్య 17,656కి చేరింది. ఇందులో 2,841 మంది కోలుకోగా.. 559 మంది మరణించారు. ఇంకా 14,255 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

17:47 April 20

కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్​

కరోనాపై పోరులో భాగంగా రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్న హెల్త్​ వర్కర్లకు రక్షణ కల్పిస్తూ ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇందులో నియమాల ప్రకారం... ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వైరస్​ను వ్యాప్తి చేయాలని ప్రయత్నించినా, ప్రభుత్వానికి సహకారం అందించకపోయినా వారు శిక్షార్హులు. ఇప్పటికే కేరళ, ఉత్తరప్రదేశ్​ ఈ తరహా ఆర్డినెన్స్​ జారీ చేశాయి.

కొంత మందిని క్వారంటైన్​కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు, వైద్య బృందంపై.. పాదరాయణపురంలో  దాడి జరిగింది. ఈ ఘటన చర్చనీయాంశం కావడం వల్ల అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న వారి రక్షణపైన ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది.

17:15 April 20

  • आइए, हम उनके साहस और दृढ़-संकल्प के लिए पुलिस, सशस्त्र बलों और सुरक्षा कर्मियों का आभार व्यक्त करें। देश के भीतर लॉकडाउन को प्रभावी बनाने में, हमारे पुलिस बल संवेदनशीलता और दक्षता का परिचय दे रहे हैं तथा हमारे सशस्त्र व अर्धसैनिक-बल सीमा पार आतंकवाद से देश की सुरक्षा कर रहे हैं।

    — President of India (@rashtrapatibhvn) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రపతి కృతజ్ఞతలు...

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ వేళ ప్రజల భద్రతను, దేశ బాధ్యతను తమ భూజాలపై మోస్తోన్న పోలీసులు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సేవ చేస్తోన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘ సంస్కర్తలు, వివిధ మత సంస్థలను కోవింద్​ అభినందించారు.

16:19 April 20

  • లాక్‌డౌన్‌ అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: కేంద్రం
  • లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనదారులపై చర్యలు: కేంద్రం
  • ఉపాధిహామీ పథకం కింద కూలీల దినసరి వేతనం పెంచాం: కేంద్రం

16:18 April 20

  • గోవాలో కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • గోవాలో ప్రస్తుతం కరోనాతో ఎవరూ చికిత్స పొందట్లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం: కేంద్రం
  • కరోనా తగ్గుముఖం పట్టిన కొన్ని ప్రాంతాల్లో సడలింపులు: కేంద్రం
  • సడలింపులు ఇచ్చినా భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి: కేంద్రం

15:20 April 20

గణనీయంగా తగ్గింది...

స్పెయిన్​లో కరోనా మరణాల రేటు తగ్గింది. గత 24 గంటల్లో 400 కంటే తక్కువ మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

14:04 April 20

'మహా' విపత్తు

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,483కు చేరింది.

13:17 April 20

  • The special bond between India and Maldives strengthens our resolve to fight this common enemy together. India will stand by its close maritime neighbour and friend in this challenging time.

    — Narendra Modi (@narendramodi) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​ సాయం...

కరోనాపై పోరులో మాల్దీవులకు భారత్​ సాయమందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. మహమ్మారిపై ఇరుదేశాలు ఉమ్మడి పోరు సాగిస్తాయన్నారు. 

11:46 April 20

ఇండోర్​లో 897...

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో కరోనాకు మరో ముగ్గురు బలయ్యారు. ఒక్క ఇండోర్​ జిల్లాలోనే మృతుల సంఖ్య 52కు చేరింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 897కు పెరిగింది.

11:33 April 20

రూ.7 కోట్లు...

కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా హ్యుందాయ్​ సంస్థ పీఎం కేర్స్​ ఫండ్​కు రూ. 7 కోట్లు విరాళం ప్రకటించింది.

10:57 April 20

గుజరాత్​లో 108

గుజరాత్​లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 67కు పెరిగింది. 

10:31 April 20

  • I am glad to share that Manipur is now Corona free.Both patients hv fully recovered and have tested negative.There are no fresh cases of the virus in the state.This has been possible because of cooperation of public &medical staff and strict enforcement of lockdown @PMOIndia

    — N.Biren Singh (@NBirenSingh) April 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మణిపుర్​ విజయం...

మణిపుర్ 'కరోనా ఫ్రీ' రాష్ట్రంగా అవతరించినట్లు సీఎం ఎన్​ బీరేన్​ సింగ్​ ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా బాధితులు కోలుకున్నారని... కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని ట్వీట్​ చేశారు.​

10:24 April 20

పరిస్థితి తీవ్రం....

దేశంలో ఇండోర్​, ముంబయి, పుణె, జైపుర్​, కోల్​కతా సహా బంగాల్​లో మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని హోంశాఖ పేర్కొంది.

10:14 April 20

మరో ముగ్గురు...

మహారాష్ట్ర నాగ్​పుర్​లో మరో ముగ్గురు కరోనా బారినపడ్డారు. జిల్లాలో కేసుల సంఖ్య 76కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది.​

09:19 April 20

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

  • అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరో లేఖ రాసిన హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
  • లాక్​డౌన్​ అమలు విషయంలో రాష్ట్రాలు ఇష్ట ప్రకారం ఎటువంటి మినహాయింపులు, అనుమతులు ఇవ్వడం మంచిది కాదని పేర్కొన్న హోం శాఖ.
  • ఈనెల 15న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసిన హోం శాఖ.
  • పలు రాష్ట్రాలు నేటి నుంచి అత్యవసరం కానీ సేవలకు, కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ లేఖ రాసిన హోం శాఖ కార్యదర్శి.
  • ప్రస్తుతం దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టీకరణ.
  • విపత్తు పరిస్థితిలో రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసిన కేంద్రం.
  • ఎవరికి వారు నిర్ణయం తీసుకుని ఇలా వ్యవహరించడం వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదనే చెపుతున్నట్లు పేర్కొన్న కేంద్రం

08:54 April 20

24 గంటల్లో 36 మరణాలు- 1,553 కొత్త కేసులు

దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,553 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 17,265
  • యాక్టివ్ కేసులు: 14,175
  • మరణాలు: 543
  • కోలుకున్నవారు: 2,546
  • వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 20, 2020, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.