దేశంలో కొవిడ్-19 ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొత్తగా 76,472 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా మరో 1,021 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల మార్కు దాటింది.
![CORONA UPDATES IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8599199_coronacasesinindia.png)
రికవరీలో మరింత పురోగతి..
పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.47 శాతంగా నమోదైంది. మరణాల రేటు కూడా మరింత ఊరట కలిగిస్తూ 1.81 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!