ETV Bharat / bharat

కరోనా వ్యాప్తిని అరికట్టే ఆయుధాలు ఇవే..

కరోనా విజృంభించినప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా క్వారంటైన్‌ (దూరంగా ఉండటం) ఐసొలేషన్‌ (ఒంటరిగా ఉంచడం) లాంటి మాటలు తరచూ వినిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వీటిని పాటించాల్సిందేనని అన్ని దేశాలూ నొక్కిచెబుతున్నాయి. ఇంతకీ క్వారంటైన్‌, ఐసొలేషన్‌ అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? వేర్వారా? తెలుసుకుందాం..

author img

By

Published : Mar 21, 2020, 8:00 AM IST

corona precautions isolation, quarantine
కరోనా వవైరస్‌ వ్యాప్తిని అరికట్టే ఆయుధాలు

క్వారంటైన్​, ఐసోలేషన్.. ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న పదాలు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇవి తప్పనిసరి పాటించాలని ప్రపంచ దేశాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇవేంటో వివరంగా తెలుసుకోండి.

క్వారంటైన్‌

వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం క్వారంటైన్‌. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు.

ఐసొలేషన్‌

వైరస్‌ నిర్ధారణ అయిన లేదా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తుల్ని ఒక గదిలో వేరుగా ఉంచడం ఐసొలేషన్‌. వైరస్‌ సోకిన వ్యక్తి దాన్నుంచి కోలుకునేదాకా ఇతరులకు వ్యాపింపజేయకుండా నివారించడం ఐసొలేషన్‌ ముఖ్యోద్దేశం

వేరుగా ఉండండి

  • వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి తన జీవిత భాగస్వామికి, పిల్లలు, తల్లిదండ్రులు, రూమ్‌మేట్స్‌కు దూరంగా ఉండడం చాలా అవసరం.
  • సందర్శకుల్ని దగ్గరకు రానీయొద్దు. ఇతరులకు కనీసం ఆరడుగుల దూరం ఉండండి. ప్రజారవాణా, క్యాబ్‌ల లాంటి వాటిని వాడొద్దు.
  • ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా సంచరించొద్దు. బయటి వస్తువులను స్వేచ్ఛగా ముట్టుకోవద్దు.
  • అవకాశం ఉంటే ఒక గది, స్నానాల గదిని ప్రత్యేకించుకోండి. మీరు దగ్గినా, తుమ్మినా ఆ పరిసరాల్లో వైరస్‌ చేరుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

ఇంట్లోవాళ్లు ఏం చేయాలి?

  • రోగి లక్షణాల్ని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పరిస్థితి ముదురుతోందని అనుకుంటే వెంటనే డాక్టర్‌ను పిలిపించాలి.
  • ఇంట్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే.. వారికి వైరస్‌ వ్యాప్తి ముప్పు ఎక్కువ కాబట్టి.. రోగి దగ్గరకు వెళ్లకపోవడం మంచిది.
  • వ్యాధిగ్రస్తుడికి అవసరమైన ఆహారం, మందులు సకాలంలో అందిస్తూ ఉండాలి.
  • మాస్కులు ధరించడం తప్పనిసరి.
  • తగిన సరకుల్ని ఇంట్లో అందుబాటులో ఉంచుకోండి. అలాగని నెలల కొద్దీ సరిపడా నిల్వచేయడం సరికాదు.

ఇదీ చూడండి: దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు- 236 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.