దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. హరియాణా గురుగ్రామ్‌లోనూ కరోనా కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. వైరస్ అంటే అంతా భయపడుతున్న వేళ ఇప్పటికే చికిత్స తీసుకుంటున్న బాధితులు మాత్రం సంతోషంతో గంతులు వేస్తున్నారు. వారికి అందించే చికిత్స, కల్పిస్తున్న సదుపాయాలతో వీరు హాయిగా ఉంటూ వైరస్‌ను ఆనందంతో జయిస్తున్నారు.
ఇదీ జరిగింది..
గురుగ్రామ్ మార్కెట్లో కూరగాయలమ్మే వ్యాపారులు ఇటీవల కరోనా బారినపడ్డారు. వీరిని కరోనా ప్రత్యేక ఆసుపత్రిలో చేర్చారు. అయితే వారికి కల్పిస్తున్న సదుపాయాలు, వైద్యంతో ఆనందంగా ఉన్నారు ఈ వ్యాపారులు. తమలోతామే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ.. డ్యాన్సు కూడా చేస్తున్నారు.
హరియాణా పాటలకు వీరు వేసే స్టెప్పులు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరూ కరోనా పాజిటివ్ బాధితులని చెప్పారు సీఎంఓ అధికారి జేఎస్ పూనియా. ఆసుపత్రిలో అందించే చికిత్స, సదుపాయాల పట్ల వారందరూ సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ఈ కారణంగానే వారు డ్యాన్సులు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 15 నుంచి 'వందే భారత్ మిషన్' రెండో దశ