ETV Bharat / bharat

కరోనా పంజా: భారత్​లో 600 దాటిన కేసులు

దేశంలో కరోనా అంతకంతకూ ప్రబలుతోంది. మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 606కు చేరుకుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తొలిసారి వైరస్ కారణంగా​ మరణాలు సంభవించాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.

corona cases increase in india
దేశంలో ప్రబలుతున్న కరోనా.. పెరుగుతున్న కేసులు
author img

By

Published : Mar 25, 2020, 8:54 PM IST

దేశంలో కరోనా వైరస్​ నానాటికీ విజృంభిస్తోంది. నేడు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 606 మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 42 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో మరో 10 మందికి వైరస్ నిర్దరణ అయింది. అక్కడ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా122కు చేరింది. 9 కేసులు ముంబయిలో, ఒక కేసు ఠానేలో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కేరళలో..

కేరళలో బాధితుల సంఖ్య 112కు చేరింది. కాసరగోడ్ జిల్లాలో మరో ఆరు కేసులు నమోదైనట్లు కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పారు. కోజికోడ్‌లో ముగ్గురికి, మలప్పురం, పాలక్కాడ్‌, కొట్టాయమ్‌, ఎర్నాకులం, అలప్పుజ జిల్లాలో ఒక్కొరికి వైరస్‌ నిర్దరణ అయినట్లు తెలిపారు.

గుజరాత్‌లో..

గుజరాత్‌లో మరో ముగ్గురికి వైరస్ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 38కి పెరిగింది. అహ్మదాబాద్, సూరత్, వడోదరలో తాజా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్​లో..

రాజస్థాన్‌లో మరో నలుగురికి వైరస్ ఉన్నట్లు తేలగా అక్కడ బాధితుల సంఖ్య 36కు చేరుకుంది. బిల్వారాలో ముగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. వారిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది. ఆ ఆసుపత్రిలో ఇదివరకే విదేశాల నుంచి వచ్చిన ఒక వైద్యుడికి వైరస్ సోకగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరికీ వైరస్ సోకింది. జోధ్‌పుర్‌లో ఒక మహిళకు కరోనా సోకింది.

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐదుగురు, భోపాల్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో వైరస్‌ బాధితుల సంఖ్య 15కు చేరింది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నిర్వహించిన మీడియా సమావేశానికి, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జర్నలిస్టుకు కరోనా సోకినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 65 ఏళ్ల మహిళ కరోనా సోకి మృతిచెందింది.

బిహార్​లో..

గుజరాత్‌ నుంచి వచ్చిన 29 ఏళ్ల పట్నా వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఫలితంగా బిహార్‌లో కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.

తమిళనాడులో..

తమిళనాడుకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి వైరస్‌ సోకి చికిత్స పొందుతూ మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ వెల్లడించారు. మరో ఐదుగురికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని ప్రకటించారు. వారిలో నలుగురు ఇండోనేషియా పౌరులు కాగా వారితో ఉన్న పర్యటక గైడ్‌కూ వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా తమిళనాడులో కేసులు 23కు చేరాయి.

కర్ణాటకలో..

కర్ణాటకలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా 10 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 51కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.