దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 134 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 51, గుజరాత్- 35, ఉత్తర్ప్రదేశ్- 14, దిల్లీ- 8, రాజస్థాన్- 7, బంగాల్- 6, మధ్యప్రదేశ్- 4, తమిళనాడు- 3, పంజాబ్- 2, జమ్ము కశ్మీర్- 2, బిహార్- 1, తెలంగాణ- 1 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా పేరుతో కార్మిక చట్టాలకు కత్తెర!