ఆరోగ్యమే మహాభాగ్యం... అంటున్నారు కేరళ ఎర్నాకులంలోని పోథనైక్కోడు పోలీసులు. వారి స్టేషన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చి... పలు రకాల కూరగాయ పంటలను పండిస్తున్నారు.
రసాయన అవశేషాలు లేని ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతుల సాయం తీసుకున్నారు. బఠాణీలు, బెండకాయ, కాకరకాయ, దోసకాయ, టమాటా, మిరప, క్యాబేజి వంటి కూరగాయలు పండిస్తున్నారు.
ఘనంగా పంటకోత ఉత్సవం
పంటకోత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పోలీసులు. 'ఠాణా' కూరగాయల్ని ప్రజలకు ఉచితంగా పంచారు.
ఇదీ చూడండి : ఉన్నావ్ ఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు